చంద్రబాబుతో సింగపూర్ లో క్రికెట్ దిగ్గజం సచిన్ భేటీ

Sachin Tendulkar Meets AP CM Chandrababu In Singapore

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కలుసుకున్నారు. ప్రస్తుతం సింగపూర్‌లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అయితే… అదే సమయంలో సింగపూర్‌లో ఉన్న సచిన్ టెండుల్కర్… చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని సచిన్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. మర్యాదపూర్వక కలయిక సందర్భంగా వారిద్దరి మధ్య కొన్ని అంశాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది. ఆ గ్రామంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాను దత్తత తీసుకున్న ఆ గ్రామంలో చేపట్టిన అభివృద్ధిపై చంద్రబాబుకు వివరించానని సచిన్ తెలిపారు. మరోవైపు, సింగపూర్ లో చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు.