మామ రికార్డును బద్దలు కొడతాడా ఏంటి?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నిన్నటి తరం హీరోల్లో అత్యధిక చిత్రాలు చేసిన హీరో చిరంజీవి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 150 చిత్రాలు చేసిన చిరంజీవి ప్రస్తుతం 151వ చిత్రం ఏర్పాట్లలో ఉన్నాడు. అప్పటి హీరోల వందల సంఖ్యలో సినిమాలు చేయగలిగారు. కాని ప్రస్తుతం హీరోలు మాత్రం 25 చిత్రాలు చేయడమే గొప్పగా భావిస్తున్నారు. ఈ తరం యువ హీరోలు 50 సంఖ్య దాటగలరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సాయి ధరమ్‌ తేజ్‌ జోరు చూస్తుంటే మాత్రం మామ చిరంజీవి రికార్డును బద్దలు కొడతాడా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Sai Dharam tej and chiranjeevi

సంవత్సరంకు మూడు నాలుగు సినిమాల చొప్పున తేజూ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం ‘జవాన్‌’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెల్సిందే. ఇక వివి వినాయక్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తుండగా, కరుణాకరన్‌ దర్శకత్వంలో ఒక సినిమాను త్వరలోనే రెగ్యుర్‌ షూటింగ్‌కు తీసుకు వెళ్లబోతున్నాడు. ఇక అనీల్‌ రావిపూడితో ఒక సినిమాను చేయాల్సి ఉంది. దిల్‌రాజు బ్యానర్‌లో రెండు సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఇక ఈ సమయంలోనే మరో సినిమాను కూడా తేజూ ఒప్పుకున్నట్లుగా సినీ వార్గాల్లో ప్రచారం జరుగుతుంది. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తేజూ ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఆ సినిమా వచ్చే సంవత్సరంలో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి 2018వ సంవత్సరంలో తేజూ ఏకంగా అయిదు సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఇలాగే కంటిన్యూ అయితే తేజూ ఖచ్చితంగా మెగాస్టార్‌ చిరంజీవి రికార్డుకు చేరు అవయ్యే అవకాశాలున్నాయి.