మనకిది అవసరమా తేజూ ?

sai-dharam-tej

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయమై మంచి విజయాలు అందుకున్నాడు కట్ చేస్తే వరుసగా ఘోర పరాజయాలు ఎదుర్కొంటూ కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. వరుసగా ఆరు డిజాస్టర్ లు రావడంతో సాయి ధరమ్ తేజ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. ఇలాంటి పరిస్థితిలో చిత్రలహరి అనే సినిమా చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక తన సొంత కథతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అసలే హిట్ లేని హీరో ఈ రకంగా కథ రాసుకోవడం ఎందుకు అది కూడా ప్లాప్ అయ్యిందనుకోండి మరింతగా పరువు పోగొట్టుకోవడం తప్ప. హీరోలు నటించాలి, అది వదిలేసి మిగతా విషయాల్లో జోక్యం చేసుకుంటూ పోయి ఉన్నదీ పోయి ఉంచుకున్నదీ పోయిందన్న చందాన వెళ్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. కాబట్టి రాసే వాళ్ళు వేరు ఆ పనిని వాళ్ళని చేయనిచ్చి మంచి కథ ఎంచుకుంటే హిట్ వస్తుంది కానీ రొటీన్ కథలను ఎంచుకుంటూ ప్లాప్ లు వస్తే మిగతా వాళ్ళ మీద నెట్టేస్తూ హిట్ కోసం కథ రాసుకుంటున్నాను అంటే ఎలా తేజూ ?