భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్న “సలార్” ట్రైలర్

భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్న “సలార్” ట్రైలర్
Cinema News

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ సినిమా డిసెంబర్ 22, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానున్నది . ఈ పాన్ ఇండియా సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు . ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార సినిమా లకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన ట్రైలర్ ఆడియెన్స్ లో భారీ అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అయితే ఈ సినిమా ట్రైలర్ భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది.

భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్న “సలార్” ట్రైలర్
Salaar Cinema

ఇప్పటి వరకూ ఈ ట్రైలర్ 135 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. శృతి హాసన్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా లో జగపతి బాబు, పృథ్వీ రాజ్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా కి రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు.