Election Updates: తెలంగాణ సీఎం రేవంతే..!కేబినెట్ లో అవకాశం ఎవరెవరికి అంటే..!

Political Updates: CM Revanth Reddy gave good news to Congress party workers
Political Updates: CM Revanth Reddy gave good news to Congress party workers

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ ని గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమాంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కాంగ్రెస్ హై కమాండ్ నుంచి అందిన సమాచారం.ఈరోజు ఈ అంశంపై అధిష్టానం అసలు నిర్ణయాన్ని వెలువడించనుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ హైద్రాబాద్ లో మకాం వేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.అయితే రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఎవరు ఉండబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్లోని పెద్దలు,సీనియర్లు సైతం పదవులను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల జాబితా AICC నుంచి మీడియాకి లీకైంది. ఇంతకీ కేబినెట్ లో ఎవరెవరు ఉన్నారంటే ….

1-ఏనుముల రేవంత్ రెడ్డి- తెలంగాణ ముఖ్యమంత్రి

2-భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి/ ఆర్ధికశాఖమంత్రి

3-షబ్బీర్ ఆలీ -ఉప ముఖ్యమంత్రి/మైనార్టీ శాఖ మంత్రి

4-సీతక్క-హోం శాఖ మంత్రి

5-వివేక్ వెంకట స్వామి- బీసీ SC వెల్ఫేర్ శాఖ మంత్రి

6-పెద్ది సుదర్శన రెడ్డి- వ్యవసాయ సహకార శాఖ మంత్రి

7-దూదిళ్ళ శ్రీధర్ బాబు- ఆరోగ్య శాఖ మంత్రి

8- మైనంపల్లి హనుమంతరావు -పర్యటన శాఖ మంత్రి

9-జగ్గా రెడ్డి- అటవీ శాఖ మంత్రి

10-అజరుద్దీన్- క్రీడల శాఖ మంత్రి

11- జూపల్లి కృష్ణారావు- పశుసంవర్ధక శాఖ మంత్రి

12-ఉత్తమ్ కుమార్ రెడ్డి- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి

13- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి- మున్సిపల్ శాఖ మంత్రి

14- కొండ సురేఖ- శ్రీ శిశు శాఖ మంత్రి

15- తుమ్మల నాగేశ్వరరావు- రోడ్లు భవనాల శాఖ మంత్రి

16- పొంగులేటి శ్రీనివాసరెడ్డి – భారీ నీటి పారుదల శాఖ మంత్రి

17-వెం నరేంద్ర రెడ్డి- విద్య శాఖ మంత్రి

18- అద్దంకి దయాకర్- కార్మిక శాఖ మంత్రి

19- దామోదర రాజనర్సింహ- శాసనసభపతి

20-పొందేం వీరయ్య- డిప్యూటీ స్పీకర్…

సామాజిక వర్గాల వార్వేగా పదవులను హై కమాండ్ డిసైడ్ చేసింది. మరికొద్దిసేపట్లో ఈ జాబితా బయటికి రానుంది. ఆ తరువాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమo జరుగనుంది.