మహర్షి రీమేక్ సెట్ అయ్యిందా ?

ఇటీవల సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన మహర్షి సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర భాషల్లో సినిమాను రీమేక్‌ చేయడానికి డిమాండ్‌ నెలకొంది. ఎప్పుడూ మహేష్ సినిమాల మీద ఎప్పుడు ఒక కన్నేసి ఉంచే తమిళ స్టార్ విజయ్ ఇప్పటికే తమిళ రీమేక్‌ సన్నాహాలు మొదలుపెట్టేసినట్లు తెలుస్తుంది. ఇక హిందీలోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా సల్మాన్‌కు నచ్చితే రీమేక్‌కు ప్లాన్‌ చేయబోతున్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్‌లో పాపులర్‌ హీరోగా ఎదిగిన సల్మాన్‌ కెరీర్‌ పరంగా అపజయాలు ఎదుర్కొంటున్న సమయంలో మహేశ్‌బాబు ‘పోకిరి’ హిందీ రీమేక్‌ ‘వాంటెడ్‌’లో నటించి ఆయన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు. ఈ నేపథ్యంలో ‘మహర్షి’ రీమేక్‌కు కూడా సల్మాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని బాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.