ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

Prabhas Radha Krishna Movie Title JAAN

బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ సాహో లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సాహో చిత్రానికి సంబంధించి అప్‌డేట్స్ ఏవీ ఈ మధ్య బయటకురాకపోవడంతో ప్రభాస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌కు సన్నిహితంగా ఉండేవాళ్లను సాహో అప్‌డేట్స్ కోసం ఎంక్వయిరీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన అభిమానులకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు. ”హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు? మీకోసం రేపు ఓ సర్‌ప్రైజ్ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజీ చూడండి.” అంటూ ఓ వీడియోను విడుదల చేశాడు ప్రభాస్. ‘డార్లింగ్ ఇవ్వబోయే ఆ సర్‌ప్రైజ్ ఏంటా?’ అని అభిమానులు అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బహుశా సాహో నుండి ఏదైనా లుక్ రిలీజ్ చేస్తారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.