సమంత సినిమాలకు గుడ్‌ బై ?

samantha akkineni Says goodbye to films

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత గత సంవత్సరం అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. కెరీర్‌ ఆరంభంలో పెళ్లి అయిన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెబుతాను అంటూ సమంత ప్రకటించింది. అయితే పెళ్లి అయిన తర్వాత కూడా సమంత జోరుగా చిత్రాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం సమంత చేస్తున్న నాలుగు సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఈ నాలుగు సినిమాల తర్వాత సమంత మరే సినిమాకు కమిట్‌ అవ్వడం లేదు. ఇటీవల ఒక ప్రముఖ నిర్మాత సమంతను తన సినిమాలో బుక్‌ చేసేందుకు వెళ్లిన సమయంలో ఆమె నో చెప్పినట్లుగా ఆయన చెబుతున్నాడు. సరైన కారణం ఏదీ చెప్పకుండా తన ప్రాజెక్ట్‌లో నటించలేను అంటూ చెప్పుకొచ్చింది. అందుకే ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పాలని భావిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు మరియు తమిళంలో సమంతకు ఇంకా కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. సమంత చేయాలే కాని తెలుగు మరియు తమిళ స్టార్‌ హీరోలు ఆఫర్లు ఇస్తారు. కాని సమంత మాత్రం ఆసక్తిగా లేదని టాక్‌ వినిపిస్తుంది. సమంత సినిమాలకు గుడ్‌బై చెప్పేసి వ్యాపారాలు చూసుకుంటే నాగచైతన్యకు భార్యగా ఉండిపోవాలని భావిస్తుందనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ నుండి లేదా సమంత నుండి కాని ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. దాంతో మీడియాలో వస్తున్న ఈ వార్తలు కేవలం పుకార్లుగా మిగిలిపోతాయేమో అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. సమంత అభిమానులు కూడా అవి పుకార్లే అవ్వాలని, సమంత సినిమాలకు గుడ్‌బై చెప్పాలనే ఆలోచనను విరమించుకోవాలంటూ అంతా కోరుకుంటున్నారు. సమంత హీరోయిన్‌గా ఇంకా చాలా కాలం కొనసాగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయమై సమంత ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.