మెగా ఫ్యామిలీకి కత్తి హెచ్చరిక

Kathi Mahesh comments on Nagababu over Lord Sri Rama Issue

కత్తి మహేష్‌ను తాజాగా పోలీసులు రామాయణం మరియు రాముడిని కించ పర్చేవిధంగా మాట్లాడినందుకు అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. అరెస్ట్‌ అయిన వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చేసిన కత్తి మహేష్‌ మళ్లీ మెగా ఫ్యామిలీపై విరుచుకు పడ్డాడు. మెగా ఫ్యామిలీ వారు కుట్ర చేసి తనను కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కత్తి మహేష్‌ అంటున్నాడు. కత్తి మహేష్‌ కేసు విషయంలో మెగా బ్రదర్‌ నాగబాబు తీవ్రంగా స్పందించిన విషయం తెల్సిందే. హిందువుల పట్ట అనుచితంగా ప్రవర్తించడంతో పాటు, హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడిన కత్తి మహేష్‌ పట్ల ఉదాసీనత అస్సలు ప్రదర్శించవద్దని, అతడిని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. కత్తి మహేష్‌ను ఉపేక్షిస్తే మరింతగా హిందూ దర్మంను విమర్శిస్తాడు అంటూ నాగబాబు ఆరోపించాడు.

నాగబాబు ఆరోపణలపై కత్తి మహేష్‌ స్పందిస్తూ… జనాలను తనపైకి రెచ్చగొట్టే విధంగా నాగబాబు మాట్లాడాడు అని, అతడు ఫ్యాన్స్‌ను తనపైకి ఉసిగొల్పే విధంగా వ్యాఖ్యలు చేశాడు అంటూ ఆరోపిస్తున్నాడు. తనకు కనుక ఏమైనా అయితే అందుకు పూర్తిగా మెగా ఫ్యామిలీ బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించాడు. నా పేరును ఉచ్చరించకుండానే నన్ను నీచుడు అంటూ నాగబాబు గారు సంబోధించడం జరిగింది.

తాను అంత నీచమైన పని ఏం చేశానో నాకైతే అర్థం కాలేదు. మేము, మా కుటుంబ సభ్యులం రామ భక్తులం, రాముడిని పూజిస్తాం. అయితే తాను సందర్బంగా వచ్చింది కనుక రాముడి గురించి నాకు తోచిన వ్యాఖ్యలు చేశాను. అంతమాత్రానికే నీచుడిని అవుతానా అంటూ కత్తి మహేష్‌ ప్రశ్నిస్తున్నాడు. నాకున్న వాక్‌ స్వాతంత్య్రంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశాను అని, తనను ఏదైనా చేయాలని మెగా ఫ్యాన్స్‌ మరియు మెగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారేమో. అందుకే నాకు ఏమైనా చిన్న గాయం అయినా కూడా అందుకు కారణం మెగా ఫ్యామిలీ అవుతుందని, నాపై చిన్న దెబ్బ పడ్డా కూడా మెగా ఫ్యామిలీ బాధ్యత వహించాలంటూ కత్తి మహేష్‌ అన్నాడు.