టాప్ లో దూసుకుపోతున్న సమంత, మహేష్ బాబు…

ప్రముఖ టాలీవుడ్ స్టార్ టాప్ లెవల్లో దూసుకుపోతున్నారు. ప్ర‌ముఖ ఓర్మాక్స్ మీడియా మార్చి నెల‌కు సంబంధించి తెలుగు, తమిళ నటీనటుల టాప్ టెన్ జాబితాలను రిలీజ్ చేసింది. ఇందులో తెలుగు సినిమా లిస్ట్ లో సమంతా అక్కినేని అగ్రస్థానంలో నిలవగా…. కోలీవుడ్‌లో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే…. లేడీ సూపర్ స్టార్ నయనతార మొదటి స్థానాన్ని సంపాదించుకుంది.

అదేవిధంగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు.. తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గతంలో ఉన్న ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుబాటిలని వెన‌క్కి నెట్టి తొలి స్థానాన్ని ద‌క్కించుకోవడం విశేషంగా చెప్పవచ్చు. కాగా గత రెండేళ్లలో ఒక్క సినిమా కూడా చేయ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. అయితే తమిళంలో విజయ్ టాప్ పొజీష‌న్‌లో ఉండ‌గా ఆయ‌న త‌ర్వాతి స్థానాల‌లో అజిత్, సూర్య‌, ధ‌నుష్‌, విజ‌య్ సేతుప‌తి వంటి నటులు ఉన్నారు.