రాజమౌళిపై మండిపడుతున్న నెటిజెన్స్

రాజమౌళిపై మండిపడుతున్న నెటిజెన్స్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో ప్రపంచ సినిమాను తెలుగు నేల వైపు తిరిగి చూసేలా చేసారు అందులో నో డౌట్. అలాగే ఈ చిత్రాలతో మన దేశంలోనే నెంబర్ 1 దర్శకునిగా రాజమౌళి మారిపోయారు. తాను తీసే సినిమాల్లో ఎలాంటి కంటెంట్ ఉంది అన్న విషయం పక్కన పెడితే బాక్సాఫీస్ రికార్డులను మాత్రం రాజమౌళి ఎంతో అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలు కూడా అందుకోని విధంగా సెట్ చేసి పెట్టాడు.

అలాంటి రాజమౌళిపై ఇప్పుడు నెటిజన్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రపంచంలో అత్యుత్తమ అవార్డు ఏదన్నా ఉంది అంటే అది ఆస్కార్ అవార్డు అని అందరికీ తెలుసు. అలాంటి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న సినిమాయే రాజమౌళికి నచ్చలేదు అని చెప్పేసరికి ఒక్కసారిగా నెటిజన్స్ రాజమౌళిపై ఫైర్ అవుతున్నారు.

2020 ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ది బెస్ట్ చిత్రంగా అవార్డు సొంతం చేసుకున్న “పారాసైట్” సినిమా తనకు నచ్చలేదని ఫస్ట్ హాఫ్ అంతా పడుకున్నానని అంతేకాకుండా సినిమా పూర్తి కాకుండానే ఆఫ్ చేసేసానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పగా అది కాస్తా సంచలనంగా మారింది. దీనితో రాజమౌళి సినిమాలను ఆ సినిమాతో పోలుస్తూ కొంతమంది సెటైర్లు వేస్తుండగా మరికొంత మంది మండిపడుతున్నారు.