నిరాశ చెందుతున్న అల్లు అర్జున్ అభిమానులు

నిరాశ చెందుతున్న అల్లు అర్జున్ అభిమానులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. మన టాలీవుడ్ లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కాబడిన ఈ చిత్రం అంతే స్థాయిలో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కూడా హిట్టయ్యింది.

అయితే ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు. ఈ లాక్ డౌన్ సమయంలో జెమినీ టీవీ సరికొత్త సినిమాలతో అదరగొడుతుంది. అదే విధంగా ఈ అల వైకుంఠపురములో సినిమాను కూడా టెలికాస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కొన్ని రోజుల కితమే చెప్పారు.

అలాగే ఈ చిత్రాన్ని మే 1 న టెలికాస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని బజ్ వినిపించింది. కానీ ఇప్పుడు ఆ స్లాట్ లో కూడా ఈ చిత్రం టెలికాస్ట్ అయ్యే అవకాశం లేదని చెప్పాలి. మొన్న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ బాగా డిమాండ్ చేసారు.

కానీ అప్పటికే పలు సినిమాలు జెమినిలో సిద్ధంగా ఉండేసరికి అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ మిస్సయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనితో ఈసారి కూడా బన్నీ అభిమానులకు నిరాశ తప్పేలా లేదని చెప్పాలి. మరి జెమినీ టీవీ వారు ఎప్పుడు ఈ చిత్రాన్ని ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో