అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న అల్లు అర్జున్ పాత్ర

అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న అల్లు అర్జున్ పాత్ర

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలు మూసధోరణికి దూరంగా కొత్తదనం కలిగి ఉంటాయి. 2003లో వచ్చిన ఆర్య చిత్రం నుండి రంగస్థలం వరకు ఆయన అనేక జోనర్స్ ట్రై చేశారు. జోనర్ ఏదైనా ఆయన చిత్రాలు ట్రెండీగా ఉంటాయి. ఈ లెక్కల మాస్టారు సినిమాలలో సన్నివేశాలు ఎప్పుడూ, లాజిక్ మిస్ కావు. కాగా ఆయన తనకు ఇష్టమైన మరియు తన ఫస్ట్ హీరో బన్నీ తో మూవీ చేస్తుండగా, దానికి పుష్ప అనే టైటిల్ నిర్ణయించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన పల్లెటూరి మొరటు కుర్రాడిగా బన్నీ లుక్ ఆసక్తికరంగా ఉంది.

కాగా ఈ టైటిల్ లోగో మరియు బన్నీ లుక్ చూస్తుంటే.. ఇది క్రైమ్ థ్రిల్లర్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బన్నీ లారీ డ్రైవర్ గా చేయనున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, సెకండ్ లుక్ లో ఆయన్ని ఎర్ర చందనం దొంగగా చూపించారు. ఇవన్నీ గమనిస్తుంటే, ఇది క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక బన్నీ రోల్ నందు కూడా డిఫరెంట్ షేడ్స్ మరియు ఊహించని ట్విస్ట్ లు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.