మరో క్రేజీ రికార్డ్‌ని సొంతం చేసుకున్న సమంత

మరో క్రేజీ రికార్డ్‌ని సొంతం చేసుకున్న సమంత

తాజాగా హైదరాబాద్ టైమ్స్ ‘30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019’లో సమంత ఫస్ట్ ప్లేస్‌ దక్కించుకుంది. అయితే వివిధ రంగాలలో రాణిస్తున్న 40 ఏళ్ల లోపు వయసు గల మహిళలను పరిగణలోకి తీసుకుని చేసిన సర్వేలో సమంత ఎక్కువ ఓట్లు దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది.

అయితే రెండవ స్థానంలో సంజనా విజ్, మూడవ స్థానంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నిలవగా, నాల్గవ స్థానంలో అదితి రావు హైదరీ, ఐదవ స్థానంలో టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజా హెగ్ధే, ఆరవ స్థానంలో రాజా కుమారి, ఏడవ స్థానంలో రకుల్‌ప్రీత్ సింగ్, ఎనిమిదవ స్థానంలో కాజల్ అగర్వాల్, తొమ్మిదవ స్థానంలో రష్మిక మందన్నా, పదవ స్థానంలో నిఖితా తన్వాని, 14వ స్థానంలో నభా నటేష్, 16వ స్థానంలో ఇషా రెబ్బా, 25వ స్థానంలో శ్రీముఖి నిలిచారు.