కరోనా భయంతో రైళ్లను రద్దు చేసిన ప్రభుత్వం

కరోనా భయంతో రైళ్లను రద్దు చేసిన ప్రభుత్వం

భయంకరమైన కరోనా వైరస్ కారణంగా ఇండియా లో రోజురోజుకు ఈ వైరస్ సంబంధిత కేసులు చాలా వరకు పెరిగిపోతున్నాయి. ఈమేరకు కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలన్నీ కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వం మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. కాగా ఈ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రజలు ఎక్కువగా గుమిగూడి ఉండే ప్రదేశాలను సైతం ప్రభుత్వాలు కట్టడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే వాటిలో కొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నాయి. మరికొన్నింటిని ఈ నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.