సమంత ప్రెగ్నెంట్ …?

Samantha Pregnant?

టాలీవుడ్‌లో ఇప్పుడొక వార్త హల్ చల్ చేస్తోంది. సెలబ్రిటీల గురించి ఎలాంటి చిన్ని వార్త అయినా అది సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతోంది. అలాంటి వార్తే మరో సారి హల్ చల్ చేస్తోంది. ఆ వార్త ఏంటంటే సమంత ప్రెగ్నెంట్ అనే వార్త.

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేయడం అనేది చిన్న విషయం కాదు. కానీ సమంత దీన్ని చాలా చిన్న విషయంగా మార్చేసింది. ఇప్పటివరకు తెలుగులో ఏ హీరోయిన్ చేయని విధంగా పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూనే ఉంది.

ఒకప్పటి మాజీ హీరోయిన్లు ఇలా చేసేవాళ్ళు. కానీ ఈ తరంలో సమంతలా ఎవరు మాయ చేయలేదు. పెళ్లి తర్వాత కూడా అంతలా సినిమాలు చేయడం ఆమెకు మాత్రమే సాధ్యమైంది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో ఉండే అలాంటి హీరోయిన్ ఒక్కసారిగా కనిపించకపోతే ఇక ఆమె గర్భం దాల్చిందని ప్రచారం మొదలవుతుంది. ప్రస్తుతం సమంత విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఓ బేబీ’ హిట్ తరవాత సమంత అంగీకరించిన ఏకైక చిత్రం ’96’ రీమేక్.

శర్వానంద్‌తో కలిసి ఈ చిత్రంలో సమంత నటిస్తున్నారు. ఇక ఎలాంటి సినిమాను సమంత సైన్ చేయలేదు. కొత్త లేడీ ఓరియంటెడ్ కథకోసం ఎదురుచూస్తోందట.

ఇంతలోనె సమంత ప్రెగ్నెంట్ అనే వార్త ప్రచారం ఊపందుకుంది. ఈ విషయాన్ని సమంత అప్పుడే బయటపెట్టకూడదని నిర్ణయించుకున్నారని అంటున్నారు. మరి ఈ విషయం మీద ఆమె క్లారిటీ ఇస్తే కానీ తేలదు