ఆస్పత్రి పాలైన సమంత… ఆందోళనలో ఫ్యాన్స్ ?

ఆస్పత్రి పాలైన సమంత… ఆందోళనలో ఫ్యాన్స్ ?
Latest News

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని ఏలుతోంది సమంత. ఏ మాయ చేసావే మూవీ తో తెలుగు చిత్ర పరిశ్రమలు అడుగుపెట్టిన హీరోయిన్ సమంత… ఆ మూవీ తోనే నాగచైతన్య ప్రేమలో పడింది.

అయితే వీరిద్దరూ 2017 సంవత్సరంలో వివాహం చేసుకోగా… 2021 లో విడాకులు కూడా తీసుకున్నారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరూ విడివిడిగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇది ఇలా ఉండగా హీరోయిన్ సమంత గురించి ఒక సంచలన న్యూస్ బయటకు వచ్చింది. తన చేతికి సెలైన్ పెట్టుకున్న ఫోటోను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆస్పత్రి పాలైన సమంత… ఆందోళనలో ఫ్యాన్స్ ?
Samantha

రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఇమ్యూనిటీ బూస్టర్ సెలైన్ ను పెట్టుకున్నట్లు చెబుతూ.. దాని లాభాలు వివరించింది సమంత. రక్త కణాల ఉత్పత్తి పెరుగుతున్నది … గుండె ఆరోగ్యం, కండరాల శక్తి, వైరస్ల దాడి నుంచి తప్పించుకోవచ్చు అని ఈ పోస్టర్ లో రాసుకొచ్చింది సమంత. కాగా ప్రస్తుతం సమంత మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సంగతి మనకీ తెలిసిందే.