సంజన కామెంట్స్‌.. ఎన్టీఆర్‌ ఐఫోన్‌, నాని చైనా ఫోన్‌

Sanjana Anne Comments On Nani

బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో మొదటి వారంలోనే సంజన ఎలిమినేషన్‌ అయ్యింది. సామాన్యురాలిగా ఎంట్రీ ఇచ్చిన సంజన తనకు తెలిసిన మోడలింగ్‌తో, తనకు ఉన్న కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తో అక్కడ ఉన్న వారికి గట్టి పోటీ ఇస్తుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా సంజన ప్రవర్తన ప్రేక్షకులకు రుచించలేదు. ప్రతి ఒక్కరిని డామినేట్‌ చేయాలనుకునే పద్దతి వల్ల ఆమె మొదటి వారంలోనే ఎలిమినేషన్‌ అయిన విషయం తెల్సిందే. సంజన కరెక్ట్‌గా ఉంటే నూతన్‌ నాయుడుకు దెబ్బ పడేది అనే విషయం అందరికి తెల్సిందే. సంజన బయటకు వెళ్లడంకు బిగ్‌బాస్‌లో కుట్ర జరిగిందనే వివాదం కూడా తెరపైకి వస్తుంది. సంజన ఉంటే ఇంట్లో వాతావరణం అంతా కూడా పాడు చేస్తుందని, అందుకే ఓటింగ్‌తో సంబంధం లేకుండా సంజనను ఎలిమినేట్‌ చేసేశారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎలిమినేషన్‌ అయిన సంజన ఒక మీడియా ఛానెల్‌ ఛర్చ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఆ సమయంలో బిగ్‌బాస్‌ షోలో ఉన్న పలువురిపై సంజన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. సంజన చేస్తున్న విమర్శల విషయం పక్కన పెడితే హోస్టింగ్‌ విషయంలో కూడా నానిపై సంజన విమర్శలు వ్యక్తం చేసింది. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ చేశాడు, రెండవ సీజన్‌కు నాని హోస్టింగ్‌ చేస్తున్నాడు. ఇద్దరి మద్య వ్యత్యాసం ఏమైనా మీకు కనిపిస్తుందా అంటూ ప్రశ్నించగా సంజన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ఐఫోన్‌ వంటి వ్యక్తి, ఒకసారి ఐ ఫోన్‌ వాడిన తర్వాత చైనా ఫోన్‌లో ఎన్ని ఫీచర్స్‌ ఉన్నా కూడా వాడాలనిపించదు. ఇప్పుడు నాని పరిస్థితి కూడా అలాంటిదే అంటూ సంజన సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయమై నాని కూడా స్పందించాడు. తనకు కూడా ఐఫోన్‌ అంటేనే ఇష్టం అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. మొత్తానికి సంజన బయటకు వచ్చి కూడా సంచలనాలకు మారు పేరుగా నిలుస్తుంది.