అలా చేయమన్నారు, అందుకే బిగ్‌బాస్‌కు నో చెప్పా!

madhavi latha talks about bigg boss 2

ఈమద్య కాలంలో మాధవిలత గురించి మీడియాలో ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం కాస్టింగ్‌ కౌచ్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ అమ్మడు, తనను ఒక దర్శకుడు పడుకుంటేనే తన సినిమాలో ఆఫర్‌ ఇస్తాను అంటూ బెదిరించాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరోలు కూడా ఎంతో మంది చాలా నీచంగా ప్రవర్తించారు అంటూ ఈమె చెప్పుకొచ్చింది. తాజాగా మాధవిలత ‘అతిథి’ చిత్ర షూటింగ్‌ సమయంలో దర్శకుడు సురేందర్‌ రెడ్డి నన్ను బూతులు తిడుతున్నా కూడా మహేష్‌బాబు చూస్తూ ఉన్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్క్రీన్‌పైనే హీరోలు కాని, రియల్‌ లైఫ్‌లో హీరోలు కారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో బిగ్‌బాస్‌ సీజన్‌ 2పై కూడా ఈమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో పాల్గొనాల్సిందిగా కాల్‌ వచ్చిందని, మొదట కాల్‌ చేసిన సమయంలో మంచిగా మాట్లాడిన నిర్వాహకులు రెండవ సారి ఫోన్‌ చేసిన సమయంలో కాస్త దురుసుగా మాట్లాడుతూ, కండీషన్స్‌ పెట్టారు అని, తాము చెప్పినట్లుగా ఉండాలని, తాము చెప్పిందే చేయాలంటూ వారు చెప్పడంతో తాను విభేదించాను అని, అందుకే బిగ్‌బాస్‌లో తనకు ఛాన్స్‌ దక్కలేదు అని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్‌లో పాల్గొంటున్న వారికి భారీ పారితోషికాలు అంటూ ప్రచారం జరుగుతుంది. కాని అందులో నిజం లేదని చెప్పుకొచ్చింది. మొత్తానికి బిగ్‌బాస్‌ షోలో పాల్గొనకపోవడమే తనకు మంచిదనిపిస్తుందని ఈ సందర్బంగా మాధవిలత పేర్కొంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 2పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ షోలో పాల్గొనే అవకాశం కోల్పోయిన వారు హ్యాపీగా ఉన్నారని ఆమెను చూస్తుంటే అర్థం అవుతుంది.