ఒకే నెలలో రెండు చిత్రాలతో చైతూ

Sailaja Reddy Alludu movie release dates

అక్కినేని నాగచైతన్య హీరోగా విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రం ప్రారంభం అయ్యి చాలా నెలలు గడిచి పోతుంది. ఈ చిత్రం విడుదల గురించి గత కొంత కాలంగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. మూడు నాలుగు నెలలుగా ఈ చిత్రం విడుదల అదుగో, ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు. షూటింగ్‌ పూర్తి అయిన ఈ చిత్రంను ఆగస్టు 17న విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య చాలా ప్రత్యేకంగా కనిపిస్తాడని, నటన పరంగా కూడా చైతూకు కొత్త గుర్తింపు దక్కుతుందని అంతా అంటున్నారు. ఇక ఈ చిత్రం విడుదలైన రెండు వారాలకే చైతూ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

నాగచైతన్య, మారుతిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల చివర్లో షూటింగ్‌ను పూర్తి చేయాలని మారుతి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న శైలజ రెడ్డి అల్లుడు చిత్రంను ఆగస్టు 31న విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు మారుతి అధికారికంగా ప్రకటించాడు. ఈమద్య కాలంలో ఒక స్టార్‌ హీరో రెండు సినిమాలు ఒకే నెలలో విడుదల కావడం చాలా అరుదు. అది కూడా కేవలం రెండు వారాల గ్యాప్‌లోనే నాగచైతన్య ఏకంగా రెండు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ రెండు చిత్రాలపై కూడా భారీ అంచనాలున్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా చిత్రాలు ఉంటాయా లేదా అనేది ఆగస్టులో తేలిపోనుంది. ఈ రెండు చిత్రాలు కూడా చైతూకు మంచి పేరును తీసుకు వస్తాయనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.