అమ్మాయిల బాత్ రూమ్ లో కెమెరా. ఏకంగా రెండువేల వీడియోలు

లేడీస్ హాస్టల్‌లో రహస్యంగా కెమెరాలు పెట్టి ఉంచి అమ్మాయిలను వీడియోలు తీసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తున్న దారుణ ఘటన వెలుగు చూసింది. తన ప్రియురాలు బట్టలు మార్చుకుంటున్న వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడంతో కంగుతిన్న ఓ ప్రియుడు విషయం ఆమెకి చెప్పడంతో ఆ విషయం బయటకు పొక్కింది. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

అయితే ఇది అంతా ఎక్కడ జరిగింది అంటే.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని వర్కింగ్ ఉమెన్ హాస్టల్ లో చోటుచేసుకుంది. విద్యార్థినులు ఎక్కువగా ఉండే ఓ లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల వ్యవహారం బట్ట బయలైంది. అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడం స్థానికంగా సంచలనం రేపింది. అమ్మాయిలు బట్టలు మార్చుకుంటున్న వీడియోలు అదే హాస్టల్‌లో ఉంటున్న ఓ యువతి బాయ్‌ఫ్రెండ్ కంటపడ్డాయి. వాటిలో తన గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉండడంతో కంగుతిన్న యువకుడు.. ఆ విషయం ప్రియురాలికి చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఏకంగా అలాంటి వీడియోలు రెండువేల వరకు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే అమ్మాయిలకు అనుమానం వచ్చి అంతా క్షుణ్ణంగా పరిశీలించడంతో నాలుగు సీక్రెట్ కెమెరాలు కనబడ్డాయి. దీన్ని హాస్టల్ నిర్వాహకుడిని నిలదీయడంతో తనకేమీ సంబంధం లేదని.. అవి గదుల్లోకి ఎలా వచ్చాయో కూడా తమకు తెలియదని తెలిపారు. మరి పోలీసులు కనుగొన్ని వివరాల ప్రకారం హాస్టల్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే వ్యక్తితో కలసి కొందరు సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టమైంది. కాగా సుమారు 2 వేల వీడియోలున్న హార్డ్ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం విశేషం.