జార్ఖండ్ లో ఘోరం. బాలికపై తొమ్మిది మంది అత్యాచారం

జార్ఖండ్‌లోని దుమ్కా అడవి ప్రాంతంలో ఘోరం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను నమ్మించి అడవి గుండా తప్పుదోవ పట్టించి బాలికపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే బాధితురాలు జార్ఖండ్‌లోని గోపికందర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతానికి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. లాక్డౌన్ కారణంగా ఆమె హాస్టల్ మూసివేయడంతో తన స్నేహితులతో కలసి దుమ్కా ప్రాంతానికి చేరుకొని ఎవరి దారిన వారు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అయితే వాస్తవానికి ఆ ప్రాంతంతోని తన తండ్రికి ఫోన్ చేసి కరుదిహ్ మోర్ నుంచి తనను తీసుకువెళ్ళమని ఆ అమ్మాయి కోరింది. ఆమె తండ్రి ఏదో ముఖ్యమైన పని కారణంగా సమయానికి చేరుకోలేకపోయాడు. దీంతో ఆమె తన స్నేహితులలో ఒకరిని పిలిచి తన గ్రామానికి తీసుకు వెళ్ళమని కోరింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ అమలు చేసిన కారణంగా పోలీసులు తమను ఆపుతారని పేర్కొంటూ.. బాలికను తప్పుదోవ పట్టించి అడవి గుండా షార్ట్ కట్ అని తీసుకువెళ్ళాడు.

తన స్నేహితుడు అడవిలోని గాడియపాని ప్రదేశం వద్ద ఒక్కసారిగా ఆగి పోయాడు. ఆ అమ్మాయి ఏమైందని ప్రశ్నించగా.. ప్రకృతి పిలుపుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మాయమాటలు చెప్పినట్లు బాలిక తెలిపింది. మొదట తాను ఆఘాయిత్యానికి పాల్పడ్డ తర్వాత నిందితుడు తన స్నేహితులను పిలిచి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అని బాలిక తన దర్యాప్తులో వెల్లడించింది. పరిస్థితి విషమంగా ఉన్న తనని అడవి లోపల విడిచిపెట్టారని.. తనకు స్పృహ వచ్చినప్పుడు.. తిరిగి ప్రధాన రహదారికి చేరుకోగా స్థానికులు తనను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై గోపికందర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. కేసు దర్యాప్తు కోసం ఒక సిట్ బృందం కూడా ఏర్పాటు చేయబడినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులను తక్షణమే పట్టుకుని కఠిన శిక్షలు విధిస్తామని అధికారులు పేర్కొన్నారు.