మెగాస్టార్ 152లో చిరుతో పాటుగా మరో సీనియర్ నటుడు

మెగాస్టార్ 152లో చిరుతో పాటుగా మరో సీనియర్ నటుడు

ప్రస్తుతం టాలీవుడ్ లెజెండ్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరెకక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుకున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది.అలా మెల్లగా మధ్య మధ్యలో మంచి ఆసక్తికర వార్తలు కూడా ఈ చిత్రంపై ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.అలా ఈ మధ్యనే బయటకొచ్చిన చిరు లేటెస్ట్ లుక్ ఫోటోలు మంచి వైరల్ అయ్యాయి.

అలాగే ఇతర వార్తలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి.ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రంపై మరో లేటెస్ట్ అప్డేట్ బయటకొచ్చింది.ఈ చిత్రంలో చిరుతో పాటుగా మరో సీనియర్ నటుడు కూడ కనిపించబోతున్నట్టు సమాచారం.అది మరెవరో కాదు చిరుకు అత్యంత సన్నిహితుడు చిరు డెడ్లీ కాంబో డైలాగ్ కింగ్ మోహన్ బాబు.ఈయన ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా బజ్ వినిపిస్తుంది.ఇప్పటికే బయటకొచ్చిన చాలా వార్తలు నిజమయ్యాయి సో ఇది కూడా నిజమయ్యేందుకు ఆస్కారం ఉందని చెప్పొచ్చు.ఒకవేళ నిజం అయితే ఈ ఇద్దరి మధ్య సీన్లు మాత్రం మంచి హైలైట్ అవుతాయని చెప్పాలి.