“హరిహర వీరమల్లు” పై సెన్సేషనల్ క్లారిటీ ..!

Sensational clarity on
Sensational clarity on "Harihara Veeramallu"!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ప్రస్తున్న మూవీ లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. మరి నిధి అగర్వాల్, బాబీ డియోల్ లాంటి స్టార్ కాస్ట్ నటిస్తున్న ఈ మూవీ పవన్ కెరీర్ లోనే ఒక మోస్ట్ అవైటెడ్ సినిమా గా నిలిచింది.

అయితే పలు కారణాలు చేత ఆలస్యం అవుతున్న ఈ మూవీ కి కూడా సీక్వెల్ ఉందని ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు దీనిపై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ నిర్మాత ఏ ఎం రత్నం మాట్లాడుతూ మూవీ పై ప్రచారం చేస్తున్న కొన్ని ఫేక్ వార్తలు తిప్పి కొట్టారు.

Sensational clarity on "Harihara Veeramallu"!
Sensational clarity on “Harihara Veeramallu”!

మూవీ ఆగిపోయింది అని ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని దీనికి రెండో భాగం కూడా ఉందని కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ మూవీ కి సీక్వెల్ ఉందా లేదా అనే అంశంపై ఇప్పుడు సెన్సేషనల్ క్లారిటీ వచ్చేసినట్టే అని చెప్పాలి. ఇక ఈ భారీ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏపీ ఎన్నికలు అనంతరం అయితే పవన్ ఈ మూవీ షూట్ రీస్టార్ట్ చేయనున్నారు.