కాంచన 3 హీరోయిన్ కి సెక్స్ వేధింపులు !

రష్యన్‌ నటిని వేధింపులకు గురి చేసిన ఫోటో గ్రాఫర్ ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. రష్యాకు చెందిన 34 ఏళ్ల మహిళ తన భర్త పిల్లలతో కలిసి 10 ఏళ్ల క్రితం చెన్నైకి వచ్చింది. స్థానిక ఎంఆర్‌సీ నగర్‌లో నివసిస్తూ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. ఇటీవల లారెన్స్‌ నటించి, తెరకెక్కించిన కాంచన 3 చిత్రంలో లారెన్స్ సరసన హీరొయిన్ గా నటించారు. బుధవారం ఆమె తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆమెతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన రూపేష్ కుమార్‌ అనే 26 ఏళ్ల యువకుడు తనకు పరిచయం అయ్యాడని పేర్కొంది. అతను తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి పలు భంగిమల్లో ఫొటోలు తీశాడని అనంతరం ఆ ఫొటోలను తన వాట్సాప్‌కు పంపాడనీ, ఆ తరువాత తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, లేని పక్షంలో ఆ ఫొటోలను ఇంటర్నెట్‌లో విడుదల చేస్తానని బెదిరిస్తున్నాడని తన ఫిర్యాదులో తెలిపింది. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ దురై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూపేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.