“శైలజా రెడ్డి అల్లుడు” వచ్చేసాడు… @ట్రైలర్

Shailaja Reddy Alludu Official Trailer

“హోయ్… హోయ్… హోయ్… ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా…  ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా” ఈ పాత గుర్తు ఉండని తెలుగు సినిమా లవర్ ఉండరు. ఈ పాటని చైతన్య కి సెట్ చేస్తే…! సెట్ చేసేసారు… మారుతీ గతంలో కూడా బొబ్బిలి రాజ థీమ్ మ్యూజిక్ ని బాబు బంగారం సినిమాలో తిరిగి గుర్తు చేస్తే, ఇప్పుడు హలో బ్రదర్ మ్యూజిక్ ని… నాగ చైతన్య ని కొత్త గడ్డం లుక్ తో ప్రెజెంట్ చేస్తున్నారు మారుతి. రమ్య కృష్ణ గారిలో అహంతో ఆకాశాన్ని తాకిన నీలాంబరిని మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తున్నట్టు ఉన్నారు. ఇక మన బబ్బ్లీ బ్యూటీ అను ఆఫర్స్ మీద ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఖచ్చితమయిన హిట్స్ పడడం లేదు. ఇప్పటి వరకు తను నటించిన సినిమాల్లో హిట్స్ కన్నా కూడా సోసోగా వెళ్లిపోయిన సినిమాలే ఉన్నాయ్. అయితే, ఈ సినిమాలో చీర కట్టుతో కుర్రోళ్ళ గుండెలను కతుక్కుమనిపిస్తుంది.

saila-reddy-alludu

మారుతి స్టైల్ వినోదం, నాగ చైతన్య మాస్ లుక్, అను అందం, రమ్య కృష్ణ రౌద్రం, వెన్నెల కిషోర్ అండ్ పృథ్వీ రాజ్ కామెడీ ఈ సినిమాను హిట్ చేస్తాయనే అనిపిస్తుంది. ఇక ఈ సినిమా కి పోటీగా చైతూ సతీమణి సమంతా తన యూ-టర్న్ ని కూడా సెప్టెంబర్ 13కే తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు, వేరు వేరు హీరోల సినిమాలు ఒకే రోజు రావడం చూశాం, అలాగే, ఒకే ఫ్యామిలీ హీరోస్ మూవీస్ కూడా రావడం చూశాం. ఇది అంతకు మించిలా, భార్య భర్తల సినిమాలు ఒకే రోజు రావడం చాలా ప్రత్యేకం. ఇంకో విషయం ఏంటంటే, సమంతా ఏదో హీరో పక్కన హీరోయిన్ లా ఉండి, ఆ సినిమా రిలీజ్ అయితే అదో రకం, అలా కాకుండా సమంతానే మెయిన్ లీడ్ గా వస్తున్నారు ఆ సినిమాతో. నిజంగా ఇది చూడాల్సిన సమరమే. థ్రిల్లర్ సినిమాలకి ప్రాధాన్యం ఇస్తున్న ఈ తరుణంలో యూ-టర్న్, శైలజా రెడ్డి అల్లుడు చైతన్యకి గట్టి పోటీనే ఇస్తుంది. కానీ, “శైలజా రెడ్డి అల్లుడు”, అసలు టైటిల్ లోనే ఒక సాలిడ్ సౌండింగ్ ఉంది. ఇక సినిమా లో ఎంత సౌండింగ్ ఉంటుందో చూడాలి. మీరు అయితే ఈ ట్రైలర్ చూసేయండి…