షకీలా బయోపిక్ ఫస్ట్ లుక్ – ఘాటుగానే ఉంది

Shakeela Biopic First Look

మల్లువుడ్ (కేరళ మలయాళ సినీ ఇండస్ట్రీ) లో షకీలా అంటే ఒక దశాబ్దం క్రితం వరకు ఒక సూపర్ స్టార్. ఆమె నటించేవి థర్డ్ గ్రేడ్ సినిమాలు అయినప్పటికీ, స్టార్ హీరోలు అయిన మమ్మూట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి వంటి వారు కూడా తమ తమ సినిమాలను షకీలా సినిమా రిలీజ్ డేట్స్ తో క్లాష్ కాకుండా చూసుకొని మరీ రిలీజ్ చేసుకొనేవారు. ఆమె సినిమాలు పోర్న్ కి తక్కువగా ఉండి, మల్లువుడ్ సినిమా అంటే తన సినిమానే అనేంతగా ఏకచత్రాధిపత్యంగా ఏలింది. ఆ తరువాత వచ్చిన టెక్నాలజీ సంచలనంతో, ప్రపంచం లోని ప్రతి విషయం అరచేతిలోని స్మార్ట్ ఫోన్ లో కనిపించడంతో, షకీలా లాంటి నటీమణుల సినిమాలకి ఆదరణ కరువయ్యింది.ఇప్పుడు షకీలా జీవితచరిత్రని బయోపిక్ గా తెరకెక్కించడానికి ఇంద్రజిత్ లంకేశ్ పూనుకొని, బాలీవుడ్ నటి రిచా చద్దా ని షకీలా పాత్రలో ఎన్నుకొని సినిమాకి దర్శకత్వం వహించి, నిర్మించారు.

షకీలా బయోపిక్ ఫస్ట్ లుక్ - ఘాటుగానే ఉంది - Telugu Bullet

ఈరోజు షకీలా సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఒంటిమీద నూలుపోగు లేకుండా, ఒళ్ళంతా బంగారం కప్పుకొని, మత్తైన కళ్ళతో కవ్విస్తూ చూస్తున్న రిచా చద్దా ఘాటు అందం చూసి మతిపోవాల్సిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. రిచా చద్దా కూడా బెంగళూరు లో షకీలా ని కలిసి, తనకి అవసరమైన కొన్ని విషయాలను అడిగి తెలుసుకుంది. ఈ సినిమాని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల చేయాలనీ భావిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ 2019 సమ్మర్ అని పోస్టర్లోనే ప్రకటించారు కానీ తేదీ ఏమిటన్నది ఇప్పటికి సస్పెన్స్ గానే ఉన్నదీ.

image.png