తెలంగాణ దేవుడు ట్రైలర్ – అసలేమీ చెప్పాలనుకున్నారో…?

Telangana-Devudu-Theatrical

రాబోతున్న తెలంగాణ ఎన్నికల్లో సందడి చేయాలని ఒక చిన్న సినిమా ఉవ్విళ్లూరుతున్నట్టు ఉంది ‘తెలంగాణ దేవుడు’ సినిమా ట్రైలర్ ని చూస్తుంటే. ఈ సినిమాలో శ్రీకాంత్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించగా, ముక్కు మొహం తెలియని ఒక కుర్రాడు ఎవరో హీరోగా నటిస్తున్నాడు. తెలంగాణ దేవుడు అని చెప్పి, కథ మొత్తం తెలంగాణ చుట్టూతానో, లేకుంటే తెలంగాణ ప్రజల కష్టాలు, వారిని ఉద్ధరించే నాయకుడి గాథ ను చూపాల్సింది పోయి, కొంచెం కథ శ్రీకాంత్ చుట్టూ, చాలా కథ ఆ కొత్త కుర్రాడి డైలాగ్స్, స్టంట్ విన్యాసాల చుట్టూ, అతగాడి లవ్ స్టోరీ చుట్టూ అంటూ ఏదేదో చూపించి, తెలంగాణ సీఎం కెసిఆర్ ని ఇమిటేట్ చేసేట్లుగా శ్రీకాంత్ ని చూపిస్తూ, మొత్తానికి ఇది కెసిఆర్ బయోగ్రఫీ హ అనుకునేలా చేశాడు ఈ చిత్ర దర్శకుడు.

srikanth

ట్రైలర్ ని చూస్తుంటే సినిమాకి తక్కువ, సీరియల్ కి ఎక్కువ అన్నట్లు ఉన్న నిర్మాణ విలువలు, దర్శకత్వ ప్రతిభ చూసి, ఎవరైనా అసలు ఈ సినిమాకి ఎందుకు వెళ్లాలో, వెళ్తే ఏమి చూపిస్తారో అనేది కూడా సరిగ్గా చెప్పలేదు సరికదా చివరికి ఈ సినిమా మీద మంచి అభిప్రాయం కూడా కలగనివ్వలేదు ట్రైలర్ ని చూసిన జనాలకి. కాస్తలో కాస్త శ్రీకాంత్ ని రాజకీయ నాయకుడిగా, కెసిఆర్ అనుకరణలో చూడగలగడమే ఆనందపడే విషయం. ఈ సినిమాని హరీష్ వడ్త్యా డైరెక్ట్ చేస్తున్నాడు.