‘ఎన్టీఆర్‌’లో విఠలాచార్య ఈయనే…!

Shankar Is Selected For Vittalacharya Role In NTR Film

నందమూరి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. బాలకృష్ణ నిర్మిస్తూ నటిస్తున్న ఈ చిత్రంకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో దర్శకుడు క్రిష్‌ ఉన్నాడు. ఇక ఈ చిత్రంకు సంబంధించిన ప్రతి పాత్ర విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రియల్‌ లైఫ్‌ పాత్రలు అవ్వడంతో ఆ పాత్రల జీవం ఉట్టి పడేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి పాత్ర విషయంలో కూడా చాలా అద్యాయనం చేసి మరీ ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది.

sankar-movies

 

ఎన్టీఆర్‌తో ఎన్నో జానపద చిత్రాలను తెరకెక్కించిన విఠలాచార్య పాత్రకు గాను ఎన్‌ శంకర్‌ను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది. విఠలాచార్య పాత్రకు పలువురు నటులను పరిశీలించిన తర్వాత దర్శకుడు క్రిష్‌ శంకర్‌పై ఆసక్తి వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఎన్టీఆర్‌ చిత్రం షూటింగ్‌లో శంకర్‌ పాల్గొని తన పోర్షన్‌ను పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటించడం జరిగింది. దాంతో సినిమాపై ఓ రేంజ్‌ అంచనాలున్నాయి. బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌ ఈ చిత్రంలో ఉండటంతో అక్కడ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. చంద్రబాబు నాయుడుగా రానా మరియు ఏయన్నార్‌గా సుమంత్‌లు ఇప్పటికే ప్రేక్షకులను అలరించారు. సంక్రాంతికి నందమూరి అభిమానులకు ఎన్టీఆర్‌ చిత్రంతో డబుల్‌ ట్రీట్‌ ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

balakrishna