త్వరలో సైనా ప్రేమ పెళ్లి…!

Saina Nehwal Should Get Married To Parupalli Kashyap

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ త్వరలో ప్రేమ పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. హైదరాబాదీ బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 16న వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారని వీరి పెళ్లికి 100 మంది అత్యంత సన్నిహితులు మాత్రమె హాజరు కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

saina-marriage

అయితే అధికారికంగా ఇరు కుటుంబాలు ద్రువీకరించని ఈ పెళ్ల్లి వార్త నెట్టింట్లో మాత్రం హల్ చల్ చేస్తోంది. డిసెంబర్ 21న రిసెప్షన్ ఉంటుందని తెలుస్తోంది. వీరిద్దరూ 2005 నుంచి పుల్లెల గోపీచంద్ దగ్గర బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకున్నారు. అప్పటు వారి మధ్య చిగురించిన ప్రేమను వారు ఎప్పుడు బయటకు చూపలేదు. వీరిద్దరి ప్రేమ విషయం అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలుసు. చివరికి వారు వివాహ బంధంతో ఒకటవుతున్నారు.

saina-nehwal