రియాల్టీ షోలో కింగ్ ఖాన్

రియాల్టీ షోలో కింగ్ ఖాన్

భారతీయ సినీ నటుడు, నిర్మాత, టివీ ప్రముఖుడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ ఆయన ఓ రియాల్టీ షోలో పాల్గొన్నారు. అభిమానులు ఆయనను బాద్షా ఆఫ్ బాలీవుడ్, కింగ్ ఖాన్ అని పిలుచుకుంటారు. భారతీయులు ఎక్కువ నివసించే ప్రదేశాల్లో కూడా షారుఖ్‌ ఖాన్‌ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.

రియాల్టీ షోలో పాల్గొన్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ ఇంజినీర్‌ని కాలేక నటుడిని అయ్యాను అని చెప్పారు. అంతే కాకుండా ఎన్నో ఆసక్తికర విషయాలు తన జీవితంలో జరిగినవి తెలియచేసారు. షో వ్యాఖ్యాత షారుఖ్‌ ఖాన్‌ ను ఇంజనీర్‌ కావాలని అనుకున్నార లేక నటుడు కావాలని అనుకున్నార అని అడగ గానే ఆసక్తికర విషయాలను తెలియ చేస్తూ సమాదనం ఇచ్చారు. చివరకి అను కోకుండా నటుడిని అయ్యాను అని చెప్పారు.

చిన్నపుడు చదువుకునే రోజుల్లో చదువుకునే రోజుల్లో ఇంజనీర్ అవ్వాలని అనుకునేవాన్ని, సాద్యం కాలేక ఎకనామిక్స్‌లో గ్రాడ్యూయేషన్‌ చేశానని షారూఖ్ చెప్పారు. అంతే కాకుండా జర్నలిస్ట్‌ అవ్వాలని అనుకున్న కోరిక వల్ల పోస్ట్‌ గ్రాడ్యూయేషన్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌లో పూర్తి చేశాను అని అన్నారు. వ్యాఖ్యాత కుటుంబంతో ఎలా గడుపుతుంటారు అని ప్రశ్నించగా “సినిమాల్లో బిజీగా ఉండే నేను సరదాగా నా కుటుంబంతో గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడతాను” అని సమాదానం ఇచ్చారు.