రేప్ చేయబోతే…దాన్ని కొరికి పారేసింది

rape on nine months baby

వైద్యురాలి మీద కన్నేసిన ఓ కామాంధుడు ఆమె మీద అత్యాచారానికి పయత్నించాడు. దీంతో ఆమె అతడి మీద ఎదురుదాడి చేసి తనని తాను రక్షించుకుంది. అయితే ఈ క్రమంలో అతని నాలుక కొరికి పడేసింది ఆ డాక్టర్. సౌత్ ఆఫికా లోని బ్లోవెమ్ఫాంట్న్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల వైద్యురాలు ఇంట్లో ఉండగా ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె లిప్ లాక్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె అతడి నాలుకను తన పళ్లతో పట్టుకుని గట్టిగా కొరికింది.ఆ దెబ్బకు నిందితుడి నాలుక సగానికి కట్ అయ్యింది. నోటి నుంచి రక్తం రావడంతో కంగారుపడ్డ నిందితుడు అక్కడ నుంచి పరుగు పెట్టాడు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొరికేసిన అతడి నాలుక ను కూడా పోలీసులకు ఇచ్చింది. పోలీసులు నిందితుడి గురించి గాలించారు. చివరికి అతడు నేషనల్ హాస్పిటల్ చేరినట్లు తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని యూనివర్శిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ చేసి వైద్యులు నిందితుడికి చికిత్స అందించారు. ఆమె నాలుకను గట్టిగా కొరికి పట్టుకోవడంతో చిందర వందరగా కట్ అయినట్లు వైద్యులు తెలిపారని, చికిత్స నుంచి కోలుకున్న తర్వాత నిందితుడిని కోర్టుకు అప్పగిస్తామని చెబుతున్నారు.