ఏపీ సర్కార్ కి షాక్…కోర్టు మెట్లెక్కిన నవయుగ !

Shocked by AP Sarkar ... Navayuga on court steps down!

పోలవరం ప్రాజెక్టుపై తమను అర్ధాంతరంగా తప్పించడంపై నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఎట్టకేలకి మౌనం వీడింది. ఈ అంశంపై న్యాయం కోరుతూ హైకోర్టు తలుపుతు తట్టింది. పోలవరం కాంట్రాక్టుని ప్రభుత్వం రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అర్ధాంతరంగా తమతో ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం సరికాదని పిటీషన్‌లో కంపెనీ పేర్కొంది. పనులు వేగంగా చేస్తున్న సంస్థని పక్కన పెట్టి రివర్స్ టెండరింగ్ కి ప్రభుత్వం వెళ్లడాన్ని వ్యతిరేఖిస్తూ పిటిషన్ దాఖలు చేశారు కంపెనీ అధికారులు.

పోలవరం పనులు తమకే కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరారు.ఇవాళ హైకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగనుంది.

ఏపీలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో చూద్దామని దేశమంతా ఎదురు చూస్తున్న తరుణంలో పోలవరం ప్రాజెక్టు పనుల కోసం జగన్ సర్కారు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

అదీ కేంద్రంతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఓ జాతీయ ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ చేపట్టడం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది.