‘సాహో’ బ్యూటీ పారితోషికం ఎంతో తెలుసా?

shraddha kapoor remuneration for Prabhas sahoo movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  
‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ అమాంతం పెరిగి పోయింది. అందుకే ఆయన నటించబోతున్న తర్వాత సినిమాలో హీరోయిన్‌ కూడా అదే స్థాయిలో ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు సుజీత్‌ మరియు నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్‌ను ఎంపిక చేయడం జరిగింది. బాలీవుడ్‌లో ఈ అమ్మడు ప్రస్తుతం స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుని మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా దూసుకు పోతుంది. బాలీవుడ్‌లో ఎంత స్టార్‌ హీరోయిన్‌ అయినా కూడా ఈమె తీసుకునే పారితోషికం 5 నుండి 7 కోట్లు ఉంటుంది. కాని తెలుగులో ఈమె ప్రభాస్‌కు జోడీగా నటిస్తున్నందుకు ఏకంగా 8 కోట్లు తీసుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

‘బాహుబలి’ విడుదలైన కొన్ని వారాలకు ‘సాహో’ చిత్రం కోసం నిర్మాతలు శ్రద్దా కపూర్‌ను సంప్రదించడం జరిగింది. మొదట ఆమె తిరష్కరించింది. ‘బాహుబలి’ హీరో అనే ఉద్దేశ్యంతో ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది. కాని నిర్మాతలు షాక్‌ అయ్యే పారితోషికాన్ని చెప్పింది. దాంతో నిర్మాతలు మరియు దర్శకుడు పలువురు హీరోయిన్స్‌ను సంప్రదించారు. కాని వారిలో ఏ ఒక్కరు కూడా ప్రభాస్‌కు సరి జోడి అని దర్శకుడు ఫీల్‌ కాలేదు. దాంతో మళ్లీ శ్రద్దా కపూర్‌ వద్దకు వెళ్లడం జరిగింది. ఆమెతో పారితోషికం విషయంలో కాస్త అటు ఇటుగా మాట్లాడి 8 కోట్లకు ఫైనల్‌ చేయడం జరిగింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు అయిన బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌లు కూడా ఈ స్థాయిలో పారితోషికాలు అందుకోవడం లేదు. ఈమె ఉంటే బాలీవుడ్‌లో బిజినెస్‌ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఈ అమ్మడు ప్రభాస్‌తో కలిసి రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొనబోతుంది. 150 కోట్ల బడ్జెట్‌తో ‘సాహో’ చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. అద్బుతమైన యాక్షన్‌ సీన్స్‌ ఈ చిత్రంలో ఉంటాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. హీరోయిన్‌ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని కూడా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

లవ, కుశలు సిద్దం అవుతున్నారు

మెగా మేనల్లుడికి ఇలా కలిసొస్తుంది

గుట్టు చప్పుడు కాకుండా మొదలైన మెగా151 మూవీ