గుట్టు చప్పుడు కాకుండా మొదలైన మెగా151 మూవీ

chiranjeevi uyyalawada narasimhareddy biopic launched

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. అంతా కూడా ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రారంభించబోతున్నట్లుగా భావించారు. కాని నిన్న అష్టమి మంచిరోజు కాదనే ఉద్దేశ్యంతో నేడు సినిమాను ప్రారంభించడం జరిగింది. చిరు పుట్టిన రోజు అయిన ఈనెల 22న చిత్ర లోగోను ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత నుండి రెగ్యులర్‌ షూటింగ్‌లో చిరంజీవి పాల్గొనబోతున్నాడు. మెగా కుటుంబం మరియు రచయితలు పరుచూరి బ్రదర్స్‌ ఇక దర్శకుడు సురేందర్‌ రెడ్డిలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేవలం అయిదు నెలల కంటిన్యూ షూటింగ్‌తో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనే పట్టుదలతో సురేందర్‌ రెడ్డి ఉన్నాడు. దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు చరణ్‌ సిద్దం అయ్యాడు. అల్లు అరవింద్‌ ఈ చిత్రం నిర్మాణ పర్వవేక్షణ చేయబోతున్నాడు. అనధికారికంగా అల్లు అరవింద్‌ కూడా ఈ సినిమాలో భాగస్వామి అని తెలుస్తోంది. షూటింగ్స్‌ ప్రారంభం అయినా కూడా ఇప్పటి వరకు హీరోయిన్స్‌ ఎవరు అనే విషయంపై క్లారిటీ రాలేదు. చిరు పుట్టిన రోజున ఆ విషయంపై ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు:

మెగా మేనల్లుడికి ఇలా కలిసొస్తుంది

ఇక నితిన్‌ ఆశలు పవన్‌పైనే..!

మెగా మూవీ వాయిదా.. కారణం ఇదే