ఇక నితిన్‌ ఆశలు పవన్‌పైనే..!

pawan-and-trivikram-produces-nitin-next-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నితిన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా ‘అఆ’ చిత్రం నిలిచింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఆ’ చిత్రంతో నితిన్‌ స్టార్‌గా మరో మెట్టు ఎక్కాడు. అలాంటి సమయంలో మంచి సినిమాలను ఎంచుకోవడం, మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం చేయాలి. కాని నితిన్‌ మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకుని ‘లై’ చిత్రాన్ని చేశాడు. ‘అఆ’ చిత్రంతో వచ్చిన క్రేజ్‌ అంతా కూడా ఈ చిత్రంతో పోయిందని చెప్పుకోవచ్చు. మళ్లీ నితిన్‌ మునుపటి స్థాయికి చేరుకున్నాడు. ఇలాంటి సమయంలో నితిన్‌ తన తర్వాత సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కారణంగా ఆ సినిమాకు పవన్‌తో సంబంధం ఉంది. 

పవన్‌ ఏదైనా సినిమా ఆడియో వేడుకకు వెళ్తేనే ఆ సినిమా స్థాయి అమాంతం పెరిగి పోతుంది. అలాంటిది నితిన్‌ హీరోగా పవన్‌ నిర్మాణంలో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఆ సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ అందించడంతో పాటు, ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవన్‌, త్రివిక్రమ్‌, సుధాకర్‌ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయ్యింది. పవన్‌, త్రివిక్రమ్‌లు మెచ్చిన కథ కావడంతో ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఇలాంటి సమయంలో నితిన్‌ ఆశలు అన్ని కూడా ఆ సినిమాపైనే పెట్టుకున్నాడు. మరి నితిన్‌ ఆశలు అడియాశలు అయ్యేనా? లేక మళ్లీ నితిన్‌ స్థాయి పెరిగేనో చూడాలి.

మరిన్ని వార్తలు: