ఇలా చేశారేంటి.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నిరుత్సాహం

Prabhas -fans-not-interesting-shraddha-kapoor-saaho-heroine

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారు అనే ప్రశ్న గత రెండు మూడు నెలలుగా సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానంను యూవీ క్రియేషన్స్‌ అధికారికంగా చెప్పింది. బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ, స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ను ప్రభాస్‌కు జోడీగా ఎంపిక చేసినట్లుగా ప్రకటించారు. మొదటి నుండి కూడా శ్రద్దా కపూర్‌ పేరు వినిపించింది. కాని ఆమె ఎక్కువ పారితోషికం డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో నిర్మాతలు ఆమెను పక్కకు తప్పించారు అనుకున్నారు. కాని తాజాగా ఆ నిర్మాతలు స్వయంగా శ్రద్దాను ‘సాహో’ హీరోయిన్‌గా అనౌన్స్‌ చేయడం జరిగింది. 

‘సాహో’ హీరోయిన్‌గా బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ను ప్రకటించడంపై సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందన వస్తుంది. సినీ వర్గాల వారు చిత్ర యూనిట్‌ సభ్యుల నిర్ణయాన్ని అభినందిస్తుండగా, కొందరు ఫ్యాన్స్‌ ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ప్రభాస్‌కు శ్రద్దాకు అస్సలు సూట్‌ అవ్వదని, వారిద్దరి హైట్‌ చాలా తేడా ఉంటుందని, ఇద్దరి మద్య కెమిస్ట్రీ కూడా సరిగా వర్కౌట్‌ అవ్వదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె ట్రాక్‌ రికార్డు కూడా అంత ఆశాజనకంగా లేదని, ఆమెను కాకుండా మరెవ్వరినైనా తీసుకుని ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్‌ మాత్రం హైట్‌ సమస్యే కాదని, ఇద్దరి మద్య కెమిస్ట్రీని సృష్టించడం దర్శకుడి పని అని, అది సుజీత్‌ చేస్తాడని ఆశిద్దాం అంటున్నారు. మొత్తానికి ‘సాహో’ హీరోయిన్‌ చర్చ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. వచ్చే వారం నుండి ప్రభాస్‌, శ్రద్దాలు రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.

మరిన్ని వార్తలు:

పవన్‌ ‘రాజు వచ్చినాడు’..!

నాగగచైతన్య “సవ్యసాచి”… అంటే ?

చిరంజీవి ఇలా ఫిక్స్‌ అయ్యారు