చిరంజీవి ఇలా ఫిక్స్‌ అయ్యారు

chiranjeevi-151st-film-launch-date-fixed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో చిరంజీవి 151వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా సినిమా పూజా కార్యక్రమాలు జరపనున్నారని లేదా అధికారికంగా ప్రకటన చేయనున్నారని అంతా భావించారు. అయితే నేడు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోదల్చుకోలేదట. చిరంజీవి పుట్టిన రోజు అయిన ఈనెల 22న లోగో లాంచ్‌ కార్యక్రమం జరుగనుంది. 

మెగా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిరు పుట్టిన రోజు వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు 151వ చిత్రం ప్రారంభోత్సవం పెట్టాలని భావిస్తున్నారని అయితే అందుకు ఇంకా క్లారిటీ రాలేదు. అయితే బర్త్‌డే రోజు మాత్రం 151వ చిత్రం టైటిల్‌ లోగోను ఆవిష్కరించడం ఖాయంగా కనిపిస్తుంది. ఉయ్యాలవాడ అనే టైటిల్‌ కాకుండా ‘మహావీర’ అనే టైటిల్‌ను ఇప్పటికే చరణ్‌ రిజిస్ట్రర్‌ చేయించడం జరిగింది. చిరు బర్త్‌డే రోజు 151వ చిత్రానికి సంబంధించి పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇన్ని రోజులుగా హీరోయిన్‌ ఎవరు, టైటిల్‌ ఏంటి అంటూ ఒక్కటే చర్చ. ఆ చర్చకు ఫుల్‌స్టాప్‌ పడే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు:

చైతూ అడ్డు రాకుంటే సమంతను పెళ్లి చేసుకునేవాడిని..!

రవి తేజ ‘రాజా ది గ్రేట్’ టీజర్