మా అధ్యక్షుడు ఎమ్మెల్యే కానున్నాడా?

bjp-turns-out-a-settlers-den-actor-shivaji-raja-joins-bjp

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన శివాజీ రాజా ఇటీవలే తెలుగు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌కు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే. మా అధ్యక్షుడిగా శివాజీ రాజా ఎన్నికైన తర్వావ కొందరు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు, మరి కొందరు మాత్రం ఆయన పని తీరును మెచ్చుకుంటున్నారు. తాజాగా శివాజీ రాజా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తన కోరికను ప్రజల ముందు చెప్పుకొచ్చాడు. తాను గత 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను అని, బీజేపీ కార్యకర్తగా తాను పని చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. 

పలు సందర్బాల్లో బీజేపీ తరపున తాను ప్రచారం చేశాను అని, రామానాయుడు, కృష్ణంరాజు గార్లకు తాను ప్రచారం చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. కృష్ణంరాజు గారు ఎప్పుడైతే బీజేపీలో జాయిన్‌ అయ్యారో తాను అప్పుడే బీజేపీలో జాయిన్‌ అయ్యాను. ఇక తనది ఆంధ్రా అయినా కూడా పుట్టిన 15 సంవత్సరాలకే తెలంగాణకు వచ్చాను. కనుక నేను పూర్తిగా తెలంగాణ వాడిగా చెప్పుకుంటాను. తనకు అవకాశం ఇస్తే బీజేపీ తరపున తెలంగాణలో ఏ అసెంబ్లీ స్థానం నుండి అయినా పోటీ చేస్తాను అంటున్నాడు. బీజేపీ అబ్యర్థిగా 2019 ఎన్నికల్లో తెలంగాణ అభ్యర్థిగా ఎక్కడనుండైనా పోటీ చేయాలని శివాజీ రాజా ఉవ్విల్లూరుతున్నాడు. మరి ఆయన కల నెరవేరేనా? శివాజీ రాజా ఎమ్మెల్యే అయ్యేనా చూడాలి.

మరిన్ని వార్తలు:

షాక్‌.. మహానటితో మహేష్‌

‘ఫిదా’కు బ్రేక్‌ పడలేదు

నితిన్‌ కెరీర్‌లో పెద్ద తప్పు