‘ఫిదా’కు బ్రేక్‌ పడలేదు

fidaa movie getting record collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో మునుపెన్నడు సాధ్యం కాని వసూళ్లు ‘ఫిదా’కు వచ్చాయి. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాకు శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించాడు. సాయి పల్లవి తెలంగాణ యాసతో ఆకట్టుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు భారీగా వసూళ్లు వచ్చాయి, వస్తున్నాయి. గత నాలుగు వారాలుగా ఈ సినిమా దుమ్ము దుమ్ముగా వసూళ్లను సాధిస్తూనే ఉంది. ‘ఫిదా’ చిత్రం విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు పదికి పైగా సినిమాలు విడుదల అయ్యాయి. కాని ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

వరుసగా వస్తున్న చిత్రాలు ‘ఫిదా’ జోరును అడ్డుకోలేక పోతున్నాయి. తాజాగా విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘లై’, ‘జయ జానకి నాయక’ చిత్రాలు ‘ఫిదా’ జోరును అడ్డుకుంటాయని, కలెక్షన్స్‌కు బ్రేక్‌ వేస్తాయని అంతా ఊహించారు. కాని అలా జరగలేదు. ‘లై’ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో ఇప్పటికే ఊసులో లేకుండా పోయింది. ‘జయ జానకి నాయక’ చిత్రం కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా కూడా మాస్‌ మరీ ఎక్కువగా ఉందనే టాక్‌ ఉంది. ఇక ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం బాగున్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎక్కువగా ‘ఫిదా’ వైపుకే బెండ్‌ అవుతున్నారు. దాంతో ‘ఫిదా’ కలెక్షన్స్‌ జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో రెండు మిలియన్‌ల డాలర్లను వసూళ్లు చేసి దుమ్ము రేపిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లను సాధించి దిల్‌రాజుకు లాభాల వర్షం కురిపిస్తూనే ఉంది.

మరిన్ని వార్తలు:

షాక్‌.. మహానటితో మహేష్‌

నిత్యామీనన్‌, సాయిపల్లవి.. ఇప్పుడు ఈమె!

మహేష్‌బాబు కెరీర్‌లో మొదటి సారి..!