జేసీ ఇక యుద్ధం చేయడట… జగన్, బాబు హ్యాపీ ?

Jc diwakar reddy goodbye to Politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఈ పేరు వినగానే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు గుర్తుకు వస్తాయి. ముక్కుసూటి మాటలు, స్థాయి మరిచి చేసే ఆవేశకావేశాలు ప్రదర్శించడం ఆయనకి అలవాటు అయిపోయింది. ఆయన్ని అలా చూడటం జనానికి అలవాటు అయిపోయింది. ఓ మాటలో చెప్పాలంటే ఆయన రాజకీయ అభిమానులకి పెద్ద ఎంటర్ టైన్ మెంట్. కానీ ఆ వినోదం ఇకపై దొరుకుంతుందో, లేదో చెప్పలేని పరిస్థితి. అందుకు కారణం జేసీ తీసుకున్న తాజా నిర్ణయం.  ఇకపై ఏ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించేశారు. టీడీపీ లో చేరిన దగ్గర నుంచి వైసీపీ అధినేత జగన్ మీదకి ఒంటి కాలుమీద వెళ్లిన నేతల్లో జేసీ కి ఫస్ట్ ప్లేస్ వస్తుంది. అలాంటి జేసీ అస్త్ర సన్యాసం వార్త వినగానే జగన్, చంద్రబాబు ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అయి వుంటారు.

జగన్ తిట్లు తప్పించుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అయితే, జేసీ వ్యాఖ్యల మీద ఇక సర్దుబాట్లు చేసే అవసరం ఉండదని బాబు సంతోషం. అయితే ఈ ఇద్దరూ ఓ విషయం మర్చిపోతున్నారు. క్రీజ్ లో వున్నప్పుడు మాటలతో పని తక్కువ బాట్ తో పని ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ప్రేక్షకుడుగా స్టేడియం లో కూర్చుంటే ఓకే గానీ అదే ఆటగాడు కామెంటేటర్ గా రింగ్ లోకి దిగితే మాటల పదును ఇంకాస్త పెరుగుతుంది. ఇంతకీ జేసీ ఇంత నిర్ణయం తీసుకున్నది ఎన్నికల్లో ప్రలోభాలు తట్టుకోలేక అని చెబుతున్నా కొడుకు పవన్ కుమార్ రెడ్డి కి రూట్ క్లియర్ చేయడమే అసలు ఉద్దేశం అన్నది బహిరంగ రహస్యమే.

మరిన్ని వార్తలు:

రాహుల్ ప్లేస్ లోకి ప్రియాంక ?

కాపులకి బాబు క్లారిఫికేషన్ ఇదే …

జ‌గ‌న్ వ్యాఖ్య‌లు స‌రైన‌వి కాదుః ర‌ఘువీరారెడ్డి