రాహుల్ ప్లేస్ లోకి ప్రియాంక ?

priyanka gandhi as new congress working president

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
2014 ఎన్నికల తర్వాత జర్రున జారిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్ ని పైకి లేపడానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేయని ప్రయత్నం లేదు. అయినా ప్రధాని మోడీ దూకుడుకి అడ్డుకట్ట చేయడంలో ఒక్క సారి కూడా సోనియా సక్సెస్ కాలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా మోడీ కి దీటైన నేతగా కొడుకు రాహుల్ ని ప్రొజెక్ట్ చేయడానికి సోనియా అలుపెరగని పోరాటం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. పైగా కాలం గడిచేకొద్దీ రాహుల్ మీద దేశ ప్రజలకు నమ్మకం కలగడం మాట అటుంచి కాంగ్రెస్ శ్రేణుల్లోనే విశ్వాసం లేకుండా పోయింది. ఈ పరిణామాన్ని సోనియా ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా ఆ ఫీలింగ్స్ తో పరిస్థితులు మారవన్న చేదు వాస్తవాన్ని ఆమె గ్రహించారు.

మోడీ, అమిత్ షా ద్వయం దూకుడుకి సరైన ప్రత్యామ్న్యాయం చూడకపోతే 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందన్న చేదు వాస్తవాన్ని గమనించిన సోనియా ఓ దృఢమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అదేమిటంటే త్వరలో రాహుల్ కి బదులుగా తన కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని కూతురు ప్రియాంక కి అప్పగిస్తారట. ఈ విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ఆమె అందుకు తగ్గట్టు సిద్ధం కావాలని కుమార్తెకి చెప్పి వుంచారట. ఇప్పటికే కొందరు ప్రియాంకకి రాజకీయ పాఠాలు చెప్పే ప్రక్రియ కూడా మొదలు అయ్యిందట. రాహుల్ కి నచ్చజెప్పి మరీ ఈ మార్పుకి సోనియా శ్రీకారం చుడుతున్నారట. ఏమో సోనియా ఎన్నో ఆశలు, రాహుల్ త్యాగాలతో పునాది పడుతున్న ఈ నిర్ణయమైనా కాంగ్రెస్ దశ, దిశ మారుస్తుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు:

ముద్రగడా ఇటు చూడు… సాక్షికి నీ మీద కోపం ?

కాపులకి బాబు క్లారిఫికేషన్ ఇదే …

ఆరో్ప‌ణ‌లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా