ముద్రగడా ఇటు చూడు… సాక్షికి నీ మీద కోపం ?

sakshi wrong statements published on mudragada about kapu reservation

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కాపు రిజర్వేషన్ ఉద్యమం పేరుతో సర్కార్ మీద ముప్పేట దాడి చేస్తున్న ముద్రగడ పద్మనాభం కి ముక్కుతాడు వేసేందుకు విజయవాడలో చంద్రబాబు కాపు నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. టీడీపీ కాపు నేతలు సర్కార్ కి అనుకూలంగా, జగన్, ముద్రగడకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు దూకుడుగా మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం గతంలో చేసిన నిరాహారదీక్షని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ భూ మండలం మీద ఏ మనిషైనా 7 రోజులు ఏమీ తినకుండా ఉంటే షుగర్ లెవెల్స్ 126 ఉంటుందా అని ప్రశ్నించారు. అయితే ఇంతలో అనూహ్యంగా హోమ్ మంత్రి చినరాజప్ప కాస్త విసురుగా రామాంజనేయులు చేతిలో మైక్ లాక్కున్నారు. అంతటితో ఆ టాపిక్ ఆపేయించి ముద్రగడ పరువుకు దెబ్బ తగలకుండా చూసుకున్నారు. కానీ చినరాజప్ప అలా చేయడానికి అసలు కారణం సున్నితమైన అంశాల్ని లేవనెత్తి ప్రజల సెంటిమెంట్ ని గాయపరచకూడదనే . ఈ విషయం రామాంజనేయులుతో పాటు అక్కడ కూర్చున్న కాపు నేతలు అందరికీ అర్ధం అయ్యింది.

అయితే సాక్షి దీన్ని ఇంకో కోణంలో ప్రచారం చేయడం మొదలెట్టింది. అసలు ఏ సందర్భంలో ఇది జరిగింది అని పట్టించుకోకుండా రామాంజనేయులుని హోమ్ మంత్రి అవమానించినట్టు పత్రిక, ఛానల్ లో కధనాలు ఇచ్చింది. కానీ జరిగింది అందరూ చూస్తూనే వున్నారు. ముద్రగడ పరువు పోగూడదని చినరాజప్ప ప్రయత్నించినా సాక్షి దాన్ని కూడా తప్పు బట్టిందంటే ఇంకేమనాలో? . ఈ పరిణామం చూస్తుంటే ముద్రగడ మీద సాక్షికి కోపం ఉన్నట్టు అనిపిస్తోంది. దీని మీద ఇంకెవరో ఏదో అంటారు అనుకునే కన్నా ముద్రగడ కి ఒక్క సారి మేటర్ చూపిస్తే చాలు ఆయనకి అసలు విషయం అర్ధం అవుతుంది.

మరిన్ని వార్తలు:

కాపులకి బాబు క్లారిఫికేషన్ ఇదే …

ఆరో్ప‌ణ‌లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా

గోర‌ఖ్ పూర్ విషాదంపై న్యాయ విచార‌ణ‌