AP Politics: వచ్చే వారం పవన్ కళ్యాణ్‌ తో భేటీకానున్న ముద్రగడ !

AP Politics: Mudragada to meet Pawan Kalyan next week!
AP Politics: Mudragada to meet Pawan Kalyan next week!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కాపునేత ముద్రగడ పద్మనాభం వచ్చేవారం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేనకు చెందిన పలువురు కాపు నేతలు ముద్రగడతో వరుసగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కు ఇవ్వాలని కోరుతూ ఓ లేఖను జనసేన ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ కు ఆయన ఇచ్చినట్లు సమాచారం.

ఆ లేఖ పవన్ కు చేరిన అనంతరం జనసేనలో ముద్రగడ చేరికపై, వారిద్దరి భేటీపై స్పష్టత రానుంది. కాగా ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరతారనే దానిపై ముద్రగడ కుమారుడు గిరి బాబు స్పందించారు. టీడీపీ, జనసేన ఏ పార్టీలోకి అయినా వెళ్లే అవకాశం ఉంది…వైసీపీలోకి వెళ్లడానికి పద్మనాభం ఇంట్రెస్ట్ చూపడం లేదని పేర్కొన్నారు. ఇద్దరు పోటీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నాం, ఏదైనా పార్టీలో చేరిన తర్వాత నిర్ణయం ఉంటుందని ముద్రగడ కుమారుడు గిరి బాబు చెప్పారు .