AP Politics: అఖిల ప్రియకు బిగ్ షాక్… ఆళ్లగడ్డ బరిలో ఏవీ సుబ్బారెడ్డేనా ?

AP Politics: A big shock for Akhila Priya...Is there anything subbared in Allagadda Bari?
AP Politics: A big shock for Akhila Priya...Is there anything subbared in Allagadda Bari?

నంద్యాలలో టిడిపి సీనియర్ నేత ఏవీ సుబ్బా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆరోపించే కోవర్టును నేనేనని.. ఏవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని… ఆళ్లగడ్డ సీటు గురించి చంద్రబాబు చెవిలో చెప్పాడని అఖిలప్రియ చెప్పడం విడ్డూరంగా ఉందని చురకలు అంటించారు ఏవీ సుబ్బారెడ్డి.

ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలని ఎప్పటి నుండో ఆసక్తిగా ఉందని…పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుండి పోటీ చేస్తా, భారీ మెజార్టీతో గెలుస్తానని ప్రకటించారు ఏవీ సుబ్బారెడ్డి. పార్టీపై గౌరవంతోనే ఆళ్లగడ్డ సభకు వెళ్లలేదు…భయపడి కాదన్నారు. భూమా అఖిలప్రియ అల్టిమేటం కు , బెదిరింపులకు భయపడను స్పష్టం చేశారు ఏవీ సుబ్బారెడ్డి. సమిష్టి కృషి వల్లనే ఆళ్లగడ్డలో చంద్రబాబు సభ సక్సెస్.. ముస్లింలను కించపరస్తు మాట్లాడిన శిల్పా మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు ఏవీ సుబ్బారెడ్డి.