జ‌గ‌న్ వ్యాఖ్య‌లు స‌రైన‌వి కాదుః ర‌ఘువీరారెడ్డి

Raghuveera Reddy Denies Jagans Words

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 Raghuveera Reddy Denies Jagans Words

నంద్యాల ఉప ఎన్నిక ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో రాజ‌కీయ పార్టీలు ప్ర‌చార హోరును ఉధృతం చేశాయి.  అధికార‌, ప్ర‌తిప‌క్షాలు హోరాహోరీగా ప్ర‌చారం సాగిస్తుండ‌గా…పోటీలో నామ‌మాత్రంగా ఉన్న కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. నంద్యాల‌లో కాంగ్రెస్ నేత‌లు పాద‌యాత్ర చేశారు. పీసీసీ అధ్య‌క్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి, నంద్యాల కాంగ్రెస్ అభ్య‌ర్థి అబ్దుల్ ఖాద‌ర్ ఈ పాద‌యాత్రలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా నంద్యాల స‌భ‌లో చంద్ర‌బాబును ఉద్దేశించి జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ర‌ఘువీరారెడ్డి  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎంను కాల్చిచంపండి అని జ‌గ‌న్ వ్యాఖ్యానించ‌టం స‌రైన‌ది కాద‌ని, రాజ‌కీయ నేత‌లు ఇలాంటి మాట‌లు మాట్లాడ‌కూడ‌ద‌ని  ర‌ఘువీరా అన్నారు. వైసీపీ ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్నా..ఆ పాత్ర పోషించ‌టం లేద‌ని, రాష్ట్రంలో అస‌లు ప్ర‌తిప‌క్ష‌మే ఉన్న‌ట్టు లేద‌ని,  క‌నీసం త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను కాపాడుకునే స్థితిలో కూడా లేద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.  ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడ‌కుండా 2019లో త‌మ‌ను గెలిపిస్తే..

న‌వ‌ర‌త్నాలు అందిస్తాం అంటూ వైసీపీ ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెడుతోంద‌ని   ఆరోపించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపైనా ర‌ఘువీరా విమ‌ర్శ‌లు గుప్పించారు. తాను ఇచ్చిన పింఛ‌న్ తీసుకుంటున్నార‌ని, తాను నిర్మించిన రోడ్ల‌పై తిరుగుతున్నార‌ని.. కాబ‌ట్టి త‌న‌కు ఓటు వేయాల‌ని చంద్ర‌బాబు కోర‌టం స‌రైన‌ది కాద‌ని ర‌ఘువీరా అన్నారు. టీడీపీ, వైసీపీ ప్రత్యేక హోదా ఊసే ఎత్త‌డం లేద‌ని ఆయ‌న‌ విమ‌ర్శించారు.