నవదీప్‌ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీపై విమర్శలు

navadeep wild card entry in Bigg Boss reality show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు బిగ్‌బాస్‌ షో మంచి ఆధరణతో ముందుకు సాగుతుంది. వారం వారం ఒక్కరు ఎలిమినేట్‌ అవుతూ ఆసక్తిని మరింతగా పెంచుతున్నారు. అయితే నిన్నటి వారంలో బిగ్‌బాస్‌ ఇంటి నుండి ఇద్దరిని బయటకు పంపించడం జరిగింది. ఇద్దరు బయటకు వెళ్లి పోయారు కనుక ఒక్కరిని వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా లోనికి పంపిస్తున్నామంటూ ఎన్టీఆర్‌ ప్రకటించి, నవదీప్‌ను బిగ్‌బాస్‌ ఇంటిలోకి పంపించడం జరిగింది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా నవదీప్‌ను ఇంట్లోకి పంపించడంపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నవదీప్‌కు ప్రేక్షకుల్లో అంత క్రేజ్‌ లేదు అని, ఒక మంచి జబర్దస్త్‌ కమెడియన్‌ను లోనికి పంపినా కూడా షోకు మరింత క్రేజ్‌ దక్కేది అనేది కొందరి అభిప్రాయం.

నవదీప్‌ ఒక వివాదాస్పద హీరో అనే ఉద్దేశ్యంతోనే బిగ్‌బాస్‌ షో నిర్వాహకులు ఆయన్ను లోనికి పంపించడం జరిగింది. కాని నవదీప్‌కు వివాదాలు బాగానే ఉన్నా సాదారణ ప్రేక్షకుల్లో అంత గుర్తింపు లేదు. కింది స్థాయి ప్రేక్షకుల్లో క్రేజ్‌ ఉన్న వారిని ఎవరినైనా పంపి ఉంటే షోకు ఖచ్చితంగా మరింత బం చేకూరేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. షో ఇప్పుడు ఎలా ఉందో, నవదీప్‌ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా సాదా సీదాగా ఉంటుంది. ఇప్పటికే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అంటూ దీక్షా పంత్‌ను లోనికి పంపించినా పెద్దగా ఉపయోగం లేదు. ఆమె ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతుంది. ఇప్పుడు నవదీప్‌ కూడా ఖచ్చితంగా ఏమాత్రం ఆకట్టుకోలేడు అంటూ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే షో నిర్వాహకుల వల్ల ప్రేక్షకులు మరింతగా ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నారు. నేటి నుండి నవదీప్‌ ఎలా ప్రేక్షకులను అలరిస్తాడు అనేది చూడాలి.

మరిన్ని వార్తలు:

ఆ ఘ‌ట‌నే ఈ సినిమా క‌థ‌కు మూలం

మ‌హేశ్ అభిమానుల‌కు కృష్ణాష్ట‌మి కానుక‌

పొలిటికల్ స్క్రీన్ పై అంజలి