ఆ ఘ‌ట‌నే ఈ సినిమా క‌థ‌కు మూలం

shocking inspiration behind Kamal haasan classic mahanadi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

సినిమా ఇండస్ట్రీలో 40 ఏళ్ల ప్ర‌స్థానం గురించి వివ‌రిస్తూ… క‌మ‌ల్ చెప్పిన ఓ విష‌యం అంద‌రినీ ఉలిక్కిప‌డేలా చేసింది. త‌న‌కు న‌చ్చిన సినిమాల గురించి చెబుతూ మ‌హాన‌ది ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు క‌మ‌ల్‌. 1994లో రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా కు క‌థ స‌మ‌కూర్చింది క‌మ‌ల్ హాస‌నే. ఈ  క‌థ రాయ‌టానికి  తన‌ను సంకల్పించిన ప‌రిస్థితుల గురించి ఆయ‌న వివరించారు. మ‌హాన‌ది సినిమా స‌మ‌యంలో ఓ కొత్త క‌థ రాయాల‌ని తాను భావిస్తున్నాన‌ని, కానీ నెల రోజుల పాటు స్క్రిప్ట్ ముందుకు న‌డ‌వ‌లేద‌ని, అప్పుడు త‌న ఇంట్లో జ‌రిగిన ఓ ఘ‌టన  క‌థ ను రాసేలా ప్రేరేపించింద‌ని క‌మ‌ల్ చెప్పారు.

మ‌హాన‌ది సినిమాకు క‌థ రాయాల్సి వ‌చ్చిన సంద‌ర్భం గురించి తాను ఇప్ప‌టిదాకా ఎవ్వ‌రితోనూ పంచుకోలేద‌ని, అయితే త‌న కూతుళ్లు పెద్ద వాళ్ల‌య్యారు కాబ‌ట్టి… వారు కూడా అర్థం చేసుకుంటార‌న్న ఉద్దేశంతో ఇప్పుడు బ‌య‌ట‌కు చెప్తున్నాన‌ని ఆ కార‌ణం వివ‌రించారు క‌మ‌ల్‌. త‌మ‌ ఇంట్లో ప‌నిచేస్తున్న వారు త‌న కుమార్తెను డ‌బ్బు కోసం కిడ్నాప్ చేయ‌బోయార‌ని, వారి మోసం ప‌సిగ‌ట్టి. త‌న కూతుర్ని కాపాడుకోగ‌లిగాన‌ని, క‌మ‌ల్ చెప్పారు. ప‌నివాళ్ల మోసం తెలిసిన త‌రువాత వాళ్ల‌ను చంపేయాల‌న్నంత కోపం వ‌చ్చింద‌ని,  కానీ ఆ స‌మ‌యంలో ఆవేశం కంటే ఆలోచ‌న ముఖ్య‌మని గ్ర‌హించాన‌ని క‌మ‌ల్ తెలిపారు.

ఈ ఘ‌ట‌న త‌రువాతే… మ‌హాన‌ది సినిమాకు క‌థ రాయ‌టం మొద‌లుపెట్టాన‌ని, త‌న కుమార్తె విష‌యంలో త‌న‌కున్న భ‌య‌మే ఈ క‌థ రాయించింద‌ని చెప్పారు. మ‌హాన‌ది సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌టం సంతోషాన్నిచ్చింద‌ని, ఈ సినిమాను, ఈ సినిమాకు క‌థ రాయ‌టానికి ప్రేరేపించిన ఘ‌ట‌న‌ను ఎప్పుడూ మర్చిపోలేనని అన్నారు క‌మ‌ల్‌.  ఈ విష‌యాన్ని గ‌మ‌నిస్తే.. సామాన్యుల‌కే కాదు… సెల‌బ్రిటీ పిల్ల‌లకూ వారి పెరిగి పెద్ద‌య్యే క్ర‌మంలో భ‌యాందోళ‌న‌లు త‌ప్ప‌వ‌ని అర్ధ‌మ‌వుతుంది. ప‌నివాళ్ల మోసాన్ని గ్ర‌హించ‌గ‌లిగి, త‌న కుమార్తెను పెను విప‌త్తు నుంచి బ‌య‌ట‌పడేసిన క‌మ‌ల హాజ‌న్ నిజ‌జీవితంలోనూ హీరో అనిపించుకున్నారు.

Image result for kamal haasan comments on mahanadi script

మరిన్ని వార్తలు:

చై కు మించింది జీవితంలో ఏమీ లేదు.

ప్రకాష్‌ రాజ్‌ తీరుపై మళ్లీ విమర్శలు

‘సాహో’ హీరోయిన్‌ ఫైనల్‌