చై కు మించింది జీవితంలో ఏమీ లేదు.

samantha-talks-about-nagachaitanya-her-life

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

త్వ‌ర‌లో పెళ్లితో ఒక్క‌టి కాబోతున్న టాలీవుడ్ ప్రేమ ప‌క్షులు నాగ‌చైత‌న్య‌, స‌మంతల పైనే ఇప్పుడు అంద‌రి దృష్టంతా.అక్టోబ‌రు ఆరున గోవాలో వాళ్ల వివాహం జ‌ర‌గ‌నుంది. వివాహ ఏర్పాట్లు ఇప్ప‌టికే జోరుగా సాగుతున్నాయి. వెడ్డింగ్ కార్డు కూడా వ‌చ్చేసింది. చై, సామ్ ఇద్ద‌రూ ఎవ‌రి సినిమాల్లో వారు బిజీగా ఉంటూనే పెళ్లి ప‌నులూచూసుకుంటున్నారు. వారిద్ద‌రూ ఎక్క‌డ‌కువెళ్లినా అంద‌రూ వారి ప్రేమ‌, పెళ్లి ముచ్చ‌ట్ల గురించే అడుగుతున్నారు.

చై, సామ్ మ‌ధ్య ప్రేమ గురించి బ‌య‌ట‌కు తెలిసిన‌ప్ప‌టి ద‌గ్గ‌ర‌నుంచి అంద‌రిలోనూ క‌లిగిన సందేహం..వారిద్ద‌రూ ఎప్పుడు ప్రేమ‌లో ప‌డ్డార‌ని..ఇద్ద‌రూ క‌లిసి ఏం మాయ చేశావె, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం సినిమాల్లో క‌లిసి న‌టించారు. కొంద‌రు ఆటో న‌గ‌ర్ సూర్య స‌మ‌యంలో వారిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారంటే మ‌రికొంద‌రు మ‌నం సినిమా అప్ప‌టినుంచి ప్రేమించుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. అయితే స‌మంత మాత్రం మ‌రోలా చెప్పారు.

ఏం మాయ చేశావె సెట్స్ లో నాగ‌చైత‌న్య‌ను చూసిన క్ష‌ణ‌మే తాను ప్రేమ‌లో ప‌డ్డాన‌ని స‌మంత అన్నారు. త‌న‌కు ఎంతో స‌పోర్ట్ అందించే కుటుంబంలో కోడ‌లిగా అడుగుపెట్ట‌బోవ‌టం సంతోషంగా ఉంద‌న్నారు ఆమె. నాగ‌చైత‌న్య‌తో ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పులూ రాలేద‌ని, త‌న ప‌నిలో కానీ, వైఖ‌రిలో కానీ ఎలాంటి మార్పులను ఆశించ‌కుండా త‌ను త‌న‌లా ఉండేందుకు స‌హ‌క‌రిస్తున్న చైత‌న్య‌కు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాన‌ని స‌మంత చెప్పారు. త‌న ప్ర‌కారం త‌న‌కు ఎప్పుడో పెళ్ల‌యిపోయింద‌న్న స‌మంత‌, తాను సొంత ఆలోచ‌న‌ల్ని, నియ‌మాల‌నే పాటిస్తాన‌ని, త‌న‌కు 30 ఏళ్ల‌కు పెళ్ల‌వుతుంద‌ని త‌న‌కు ఎప్పుడో తెలుస‌ని, త‌న ఆలోచ‌న‌ల ప్ర‌కార‌మే త‌న జీవితం సాగుతుంద‌న‌డానికి ఇదో ఉదాహ‌ర‌ణ అని సంతోషం వ్య‌క్తంచేశారు. చైత‌న్య‌కు మించింది త‌న జీవితంలో ఇప్పుడు ఏదీ లేద‌ని, జీవితాంతం తాము ఒక‌రికొక‌రం తోడుగా ఉంటామ‌ని స‌మంత ఉత్సాహంగా చెప్పారు.

మరిన్ని వార్తలు:

20 ఏళ్ల బాలిక, 10 ఏళ్ల బాలుడి సీరియల్‌ హనీమూన్‌.. వివాదం

ప్రకాష్‌ రాజ్‌ తీరుపై మళ్లీ విమర్శలు

‘సాహో’ హీరోయిన్‌ ఫైనల్‌