మ‌హేశ్ అభిమానుల‌కు కృష్ణాష్ట‌మి కానుక‌

mahesh babu 25 film launch

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మ‌హేశ్ బాబు 25వ చిత్రం మొద‌ల‌యింది. ఇండ‌స్ట్రీలో స్టార్ ప్రొడ్యూస‌ర్లుగా పేరున్న సి. అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పైడిప‌ల్లి వంశీ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. మ‌హేశ్ తో పాటు ఆయ‌న భార్య  న‌మ్ర‌త శిరోద్క‌ర్‌, పిల్ల‌లు గౌత‌మ్ కృష్ణ, సితార  ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. నిర్మాత‌లు అశ్వినీద‌త్‌, దిల్ రాజు, ద‌ర్శ‌కుడు పైడిప‌ల్లి వంశీ, సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న దేవిశ్రీప్ర‌సాద్ కార్య‌క్రమానికి హాజ‌ర‌య్యారు.

మ‌హేశ్ 25 వ చిత్రం కావ‌టం, స్టార్ ప్రొడ్యూస‌ర్లు సినిమా నిర్మిస్తుండ‌టంతో చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. సినిమాలో హీరోయిన్ ఇంకా ఖ‌రారు కాలేదు. ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అను నేను చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్  సాగుతుండ‌గా… మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన స్పైడ‌ర్ విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. భ‌ర‌త్ అను నేను చిత్రం పూర్తికాగానే మ‌హేశ్ కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలో మ‌హేశ్ ప‌క్క‌న హీరోయిన్ చాన్స్ ఎవ‌రు కొట్టేస్తారో అని సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది. స్టార్ హీరోయిన్లను తీసుకుంటారా లేక‌… భ‌ర‌త్ అను నేను లోలాగా… కొత్త హీరోయిన్ కు అవ‌కాశ‌మిస్తారో చూడాలి.

మరిన్ని వార్తలు:

పొలిటికల్ స్క్రీన్ పై అంజలి

మేమిద్ద‌రం మంచి స్నేహితులం మాత్ర‌మే  

చై కు మించింది జీవితంలో ఏమీ లేదు.